1 – దసరా హాలిడేస్ తో శనివారం, ఆదివారం వీకెండ్ కలిసి రావడంతో సినిమాలు ఏవి లేకపోవడంతో దేవర బుకింగ్స్ డీసెంట్ గా కనిపిస్తున్నాయి.
2 – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమా టీజర్ లాంచ్ ను విజయవాడలోని రాజ్ – యువరాజ్ థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసమే వరుణ్ తేజ్ విజయవాడ చేరుకున్నారు
3 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “క”. ఈ చిత్రంలోని మాస్ జాతర అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. ఫుల్ సాంగ్ ఈ నెల 7 న రిలీజ్ చేయనున్నారు
4 – సుధీర్ బాబు హీరోగా వస్తున్న మా నాన్న సూపర్ హీరో సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సాయంత్రం 4.05 గంటలకు విడుదుల చేయనున్నాడు.
5 – మిస్టర్ ఇడియట్ నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ కాంతార సాంగ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను సాయంత్రం 5 గంటలకు ధ్రువ కాలేజ్ లో నిర్వహించనున్నారు
6 – గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న యూరోపియా గ్లిమ్స్ ను బంజారాహిల్స్ RK సినీప్లెక్స్ లో ఈ నెల 7న 3.00 గంటలకు రిలీజ్ చేయనున్నారు
7 – దేవర నార్త్ అమెరికా వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 5.6 మిలియన్ కు పైగా కలెక్ట్ చేసింది దేవర
8 – శివకార్తికేయన్ తాజా చిత్రం అమరన్ నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది
9 – శింబు సూపర్ హిట్ మూవీ మన్మధ నేడు రీరిలీజ్ చేయగా హౌస్ ఫుల్ షోస్ తో అదరగొట్టింది మన్మధ