NTV Telugu Site icon

Tollywood: ‘సూపర్ సిక్స్’ ట్రెండ్ ఫాలో అవుతున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ

Untitled Design (40)

Untitled Design (40)

టాలీవుడ్ లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్న హీరోలలో అడివి శేష్. కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ సినిమా డిజాస్టర్ తో సహాయనటుడి పాత్రల్లో పంజా, దొంగాట తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత 2018 లో వచ్చిన ‘గూడాచారి’ చిత్రంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ఎవరు, మేజర్, హిట్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.

Also Read: Tollywood: తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం గూఢచారి. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన గూఢచారి 2018 లో విడుదలై బాక్సాఫీస్ వద్దఘన విజయం సాధించింది. దింతో ఈ చిత్రానికి సిక్వెల్ ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మొదటి భాగాన్ని నిర్మింషన నిర్మాతలే రెండవ భాగాన్ని నిర్మిస్తున్నారు. కాగా గూఢచారి విడుదలై నేటికి 6 సంవత్సరాలు. ఆ విశేషాన్నిసెలెబ్రేట్ చేస్తూ గూఢచారి -2(G 2) కు సంబంధించి 6ఇయర్స్ 6 మూమెంట్స్ ఇన్ 60 మినిట్స్ అంటూ వినూత్న పబ్లిసిటీ స్టార్ట్ చేసి 6 పోస్టర్స్ ను విడుదల చేసారు పీపుల్స్ మీడియా నిర్మాతలు. ఒక్కో పోస్టర్స్ కు ఒక్కో టాగ్ లైన్ ను జత చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు. G2 లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయనున్నారు  నిర్మాతలు.

Show comments