Site icon NTV Telugu

సచిన్ టెండూల్కర్ బర్త్ డే… చిరు, మహేష్, వెంకీ విషెస్

Tollywood Stars wish the cricket legend Sachin Tendulkar on his Birthday

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే నేడు. ఏప్రిల్ 24న సచిన్ తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ సచిన్ కు సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న టాప్ సెలెబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ట్విట్టర్ ద్వారా సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి “మీరు బిలియన్ల హృదయాలను గెలుచుకున్నారు. బిలియన్ల భావోద్వేగాలను కదిలించారు. బిలియన్ ప్రజల కలలను సాకారం చేశారు. బిలియన్ మనస్సులను ప్రేరేపించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు డియరెస్ట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్” అంటూ పోస్ట్ చేశారు. కాగా చిరంజీవి, సచిన్ ఒక ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ కోసం కూడా అసోసియేట్ అయి ఉన్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో తనకు షూటింగ్ లు లేనప్పుడు తరచూ స్టాండ్లలో కన్పించి టీం ఇండియాను ఉత్సాహపరచడం మనం చూశాం. “క్రికెట్‌ను ఎప్పటికీ పునర్నిర్వచించిన వ్యక్తి… పుట్టినరోజు శుభాకాంక్షలు సచిన్. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇక విక్టరీ వెంకటేష్ క్రికెట్ లెజెండ్‌ సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకున్నారు.

Exit mobile version