టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, భారత్ సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి. సాధారణంగా పాన్-ఇండియా మూవీ టీంలు కూడా భారత్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ప్రచారం చేస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు దేశాన్ని దాటి విదేశాల్లో సందడి చేస్తున్నాయి. రామ్‌చరణ్, బాలకృష్ణల దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడా? ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ కోసం అమెరికాలో కొబ్బరికాయ కొట్టనున్నారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రిలీజ్‌కు ముందే అమెరికా వెళ్లడం వల్ల ఒక పని పూర్తవుతుందని భావిస్తున్నారు నిర్మాతలు. డాలర్ల మార్కెట్‌కు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత భారత్‌లో ప్రమోషన్స్ ప్రారంభించాలనేది కొత్త ట్రెండ్.
Also Read :Manchu Manoj : 100 కోట్ల “మిరాయ్”..మంచు మనోజ్ కు “డేవిడ్ రెడ్డి” కంగ్రాట్స్
తెలుగు హీరోలు ఇప్పుడు ఓవర్‌సీస్ మార్కెట్‌పై కన్నేశారు. ప్రస్తుతం ‘మిరాయ్’ టీమ్ అమెరికాలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ ముగించుకుని, అమెరికా వెళ్లిన ఈ టీమ్ ఓవర్‌సీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే బ్యానర్‌లో వచ్చే ‘తెలుసు కదా’ యూనిట్ కూడా US వెళ్లనుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవర్‌సీస్ ప్రమోషన్స్ ఇప్పుడు కంపల్సరీగా మారుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు విదేశీ మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం కీలకమవుతోంది.
Also Read :Tollywood : సూపర్ హిట్ సినిమా బ్యూటీని పక్కన పెట్టేసిన టాలీవుడ్
ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా సంక్రాంతి రేసులో భాగంగా జనవరి 9న విడుదల కానుంది. దీంతో, డిసెంబర్ 20 నుంచే అమెరికాలో ఈవెంట్‌తో ప్రమోషన్స్ మొదలుపెట్టాలని నిర్మాత విశ్వప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓవర్‌సీస్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓవర్‌సీస్ కలెక్షన్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా, అమెరికాలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ట్రెండ్ మొదలైంది ‘గేమ్ ఛేంజర్’తో. రామ్‌చరణ్ నటించిన ఈ చిత్రం అమెరికాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాతో అమెరికాలో సందడి చేశారు. ఇప్పుడు ‘అఖండ 2’ ప్రమోషన్స్ కూడా USలో జరుగుతాయా? అనేది చూడాలి. ఇలా తెలుగు సినిమాలు గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, ప్రమోషన్ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.
