తెలుగు సినిమా కార్మికుల బంద్ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ భేటీలోని కీలక అంశాలను సీ కళ్యాణ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రతిరోజూ చిరంజీవి ఫాలో అప్ చేసి సమస్య పై తెలుసుకుంటున్నారు. రేపు ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలుస్తారు.నేను ఉదయం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో అలాగే ఛాంబర్ ప్రెసిడెంట్ తో మాట్లాడాను. ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న నిర్మాతల సమస్యలను తప్పుకుండా దృష్టిలో ఉంచుకుంటాం.
Also Read : Rashmika : ఆ యంగ్ హీరో రష్మికకు బాలీవుడ్ లో హిట్ ఇస్తాడా?
అన్ని విషయాలు చర్చించి నా వంతు నేను కృషి చేస్తాను, పట్టువిడుపులు వదిలి అందరు కలసి కట్టుగా ముందుకు వెళ్లండి అని చిరంజీవి చెప్పారు. ఈ రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఆ వెంటనే షూటింగ్స్ ప్రారంభం అవుతాయి అనుకుంటున్నాం. ఫెడరేషన్ తో మాట్లాడి వాళ్ళని ఛాంబర్ కు పంపిస్తాను అని చిరంజీవి చెప్పారు. వేరే రాష్ట్రాలతో పోస్తే ఇక్కడ పని చేసే కార్మికులకు వేతనాలు ఎక్కువ, పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎక్కువ తక్కువ ఉందా అనేది వదిలేయాలి. మనకు ఇక్కడి సమస్య ముఖ్యం. మనం ఇక్కడి వర్కర్స్ తో పని చేస్తాం. చిరంజీవి కూడా ఒక ప్రొడ్యూసర్, సో ప్రొడ్యూసర్ వర్కర్ ఇద్దరు బాగుండాలి ఆయన అనుకుంటారు. లేబర్ కమిషన్ దగ్గరుండే రికార్డు ప్రకారం వేతనాలు ఇస్తే మేము వంద రెట్లు ఇస్తున్నాం. మరో రెండు, మూడు రోజుల్లో తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది’ అని అన్నారు.
