Site icon NTV Telugu

Tollywood : నేషనల్ క్రష్.. నేచురల్ స్టార్ ని మూడు సార్లు రిజెక్ట్ చేసిందా..!

Nani Rashmika

Nani Rashmika

హీరోల కెరీర్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దానికి బిగ్ ఎగ్జాంపుల్ హీరో నాని.. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ‘అష్టాచమ్మా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ నాని హీరోగా ట్రై చేస్తున్నా సమయంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారట . నువ్వు ఇండస్ట్రీలోకి సెట్ కావు.. నీ ఫేస్ కి అంత సీన్ లేదు ..ఇలా రకరకాలుగా మాట్లాడారట. అంతేకాదు నాని ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యి, హిట్స్ కొట్టిన తర్వాత కూడా చాలామంది హీరోయిన్లు ఆయన తో నటించాడిని నిరాకరించారట. ఇక ఓ హీరోయిన్ అయితే నాని కి ఏకంగా మూడు సార్లు రిజెక్ట్ చేసిందట.

Also Read : Ramayana : బాలీవుడ్ రామాయణ పై సీఎం ప్రశంసలు.. !

ఇంతకి ఆ హీరోయిన్ మరెవరో కాదు..రష్మిక మందన్నా. హా.. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక నాని తో మూడు సార్లు సినిమా చేసే అవకాశం దక్కించుకుందట. కానీ మూడు సార్లు ఆమె వాలీడ్ రీజన్ తోనే ఆ సినిమా రిజెక్ట్ చేసిందట. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్‌ అవుతోంది. ఇప్పుడు కనుక చూసుకుంటే నాని రష్మికకు మించిన స్థాయిలోనే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రీసెంట్‌గా ‘హిట్ 3’ మూవీతో నాని పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఇది అందరికి సాథ్యం కాదు. కానీ నాని తన ట్యాలెంట్ తో సాదించుకున్నాడు. ఇప్పుడు నాని తో మూవీ అంటే ఏ హీరోయిన్  రిజక్ట్ చేసే ఛాన్స్ కూడా లేదు.

Exit mobile version