టాలీవుడ్ లో సినీ హీరోల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో నెగిటివ్ పిఆర్ అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది హీరోలు కావాలనే తమకు పోటీగా ఉన్న హీరోల సినిమాల మీద, సదరు హీరోల మీద నెగిటివ్ పిఆర్ చేయిస్తున్నారనే వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో స్వయం ప్రకటిత మేధావిగా భావిస్తూ సినిమాల మీద విశ్లేషనలు చేస్తున్న ఒక యూట్యూబర్ ఒక టైర్ 2 హీరో మరో టైర్ 2 హీరోని తొక్కేందుకు నెగిటివ్ పిఆర్ చేయిస్తున్నాడు అంటూ ఆరోపణలు గుప్పించాడు.
14 Days Girlfriend Intlo: హీరోయిన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ.. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే?
అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో టీజర్లు రిలీజ్ అయిన ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నిజానికి ఈ రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ అయినా సరే ఎందుకో ఫ్యాన్స్ మాత్రం రెండు సినిమాల మధ్య కంపారిజన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వీరిలో ఒక హీరో మరో హీరో మీద నెగిటివ్ పిఆర్ చేస్తున్నాడు అంటూ సదరు యూట్యూబర్ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియా అంతా ఇదే చర్చ జరుగుతోంది. ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వాదనలకు దిగుతున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్లబోతుందో చూడాలి.