Site icon NTV Telugu

Tollywood Hero: నాకు అవార్డు ఇప్పించండి ప్లీజ్!!!

Hero Shillolute

Hero Shillolute

Tollywood Hero Desparate for Gettina an Award: ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అవార్డులు అందుకున్న వారందరూ ఆనందోత్సాహాలతో మునిగిపోతున్నారు. ఇవేమీ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాదు కానీ మంచి ప్రతిష్టాత్మక అవార్డులుగా పేరు ఉండడంతో వాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక తెలుగు సినిమా హీరో మాత్రం ఈ అవార్డుల కారణంగా వార్తల్లోకి ఎక్కాడు. ఈ అవార్డులు ఎలా ఇస్తారు అసలు నామినేషన్స్ లోకి ఎలా వెళ్లాలి అనే విషయం తెలుసుకునేందుకు ఆయన అనేక మందికి ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది .ముఖ్యంగా చాలామంది ప్రొడక్షన్ మేనేజర్లకు కూడా కాల్ చేసి ఈ ప్రాసెస్ ఏమిటో తనకు తెలియచెప్పాలని కోరినట్లుగా తెలుస్తోంది. అంతేకాక తన పేరు నామినేషన్స్ లోకి వెళ్లడమే కాదు కచ్చితంగా అవార్డు వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది.

Kamal Haasan: కమల్ హాసన్ బిగ్ బాస్ నుండి బయటకు రావడానికి అసలు కారణం అదా?

ఈ ఫోన్లలో ఏ ఫోన్ ఫలించిందో తెలియదు గానీ మొత్తానికి ఒక అవార్డుల లిస్ట్ లో నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన హైదరాబాదులో లేడు త్వరలో హైదరాబాద్ వచ్చే అవకాశం కూడా లేదు. కానీ ఒకవేళ హైదరాబాద్లో అవార్డులు ఇచ్చే అవకాశం ఉంటే కూడా వెంటనే వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. సదరు హీరో ఇప్పుడిప్పుడే మీడియాలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు. అయన సినిమాల్లో కొన్ని హిట్లు ఉన్నాయి, అదే విధంగా ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఎలాగైనా టాలీవుడ్ లో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే అతను సాధారణ హీరో ఏమీ కాదు. మంచి టాలెంట్ ఉన్న నటుడే. ఏదో ఒకరోజు అవార్డు కొడతాడు కానీ ఇప్పుడే అవార్డు కోసం పాకులాడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సంకేతాలు బయటికి వెళితే అది లాంగ్ రన్ లో ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Exit mobile version