శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్ లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాల హావ కాస్త పెరిగిందనే చెప్పాలి. అందుకు కారణం లేకపోలేదు. థియేటర్లో రిలీజ్ అయితేనే డిజిటల్ రైట్స్ కొనుగోలు చేస్తామని ఓటీటీ సంస్థలు కండిషన్ పెడుతుండడంతో ప్రతి సినిమాకు థియేటర్ రిలీజ్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ ఆగస్టు సెకండ్ వీక్ లో స్ట్రయిట్, డబ్బింగ్ రిలీజ్ సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నాయి.
Also Reda: Sandal Wood: ఇదెక్కడి విడ్డూరం.. కుక్క సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడైనా చూసారా..?
ముందుగా ఆగస్టు 9 మహేశ్ బర్త్ డే కానుకగా మురారి రీరిలీజ్ చేయగా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఇక రిలీజ్ కు ముందు కాస్త బజ్ క్రియేట్ చేసిన చిన్న సినిమా నిహారిక నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కురోళ్ళు. మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆర్. బి చౌదరి నిర్మాణంలో వచ్చిన భవనమ్ సినిమాలోకి అడుగుపెట్టే ప్రేక్షకుడే లేడు. జగపతిబాబు, అనసూయ ముఖ్య పాత్రల్లో వచ్చిన ‘సింబా’ను కరుణించే ప్రేక్షకులు లేక ఫ్లాప్ గా మిగిలింది. విజయ్ శంకర్, బ్రహ్మాజీ లీడ్ రోల్ లో వచ్చిన పాగల్ vs కాదల్ చూస్తే పాగల్ అవుతారేమోనని థియేటర్ల దరిదాపుల్లో కూడా ప్రేక్షకులు కనిపించలేదు. సంఘర్షణ అనే చిన్న సినిమా విడులైనట్టు కూడా ఎవరికి తెలియలేదు. ‘ల్యాండ్ మాఫియా’ అనే మరో ఆణిముత్యం కూడా శుక్రవారం రిలీజ్ కాగా ఆదరించే వారే కరువయ్యారు. అజయ్ ముఖ్య భూమిక పోషించిన కేస్ నం.15 కు పట్టుమని 15 టిక్కెట్లు తెగలేదంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా పరిసితి ఏంటి అనేది. వీటితో పాటు విజయ్ ఆంటోనీ హీరోగా తమిళ డబ్బింగ్ సినిమా ‘తుఫాన్’ టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించింది. కానీ ఫ్లాప్ ల సునామీలో తుఫాన్ కొట్టుకుపోయింది. విజయసేతుపతి సూపర్ డీలక్స్ రిలీజ్ కాగా సింపుల్ గా పక్కన పెట్టారు టాలీవుడ్ ఆడియెన్స్. సో ఆగస్టు 9 న అన్ని కలిపి 11 సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టగా కేవలం మురారి, కమిటీ కుర్రోళ్లను మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు.