NTV Telugu Site icon

February Release Dates: ఫిబ్రవరి రిలీజ్ డేట్లలో మార్పులు.. ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలంటే?

Theatres

సినిమా రిలీజ్ డేట్ మారడం సర్వసాధారణం. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పలు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో చెప్పుకోదగ్గ సినిమా అంటే నాగచైతన్య హీరోగా నటించిన తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సినిమాల్లో హీరోలు మంచి క్రేజ్ ఉన్న హీరోలే అయినా ఆ సినిమా మీద ఎందుకు బజ్ ఏర్పడడం లేదు. ముఖ్యంగా విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా కొంతవరకు ప్రేక్షకుల నోళ్లలో నానుతోంది. విశ్వక్సేన్ లేడీ గెటప్ వేసుకోవడం, ఆ పాత్రలో నటించడంతో ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. ఫిబ్రవరి 14వ తేదీన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్రుబా అనే సినిమా కూడా అదే రోజు రిలీజ్ ఇవ్వాల్సి ఉంది.

Dulquer: ఆకాశంలో ఒక తార కోసం కొత్త తారని దింపుతున్నారు!

కానీ ఆ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా ఎవరికీ గుర్తులేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాని మహాశివరాత్రికి వాయిదా వేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్లు. మరోపక్క సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా సినిమా ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 26వ తేదీ రిలీజ్ చేస్తే లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని భావిస్తూ ఆ డేట్ కి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రూబా కూడా అదే డేట్ మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నారా రోహిత్ మంచు మనోజ్ కీలక పాత్రలలో నటించిన భైరవం సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ ప్రకటించుకున్న సినిమాలన్నీ కాస్త ముందు వెనక అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరగబోతోంది అనేది.