డిఫరెంట్ కంటెంట్‌లతో వరుసగా సినిమాలు చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్‌లో తన ముద్రను వేస్తోంది. కొత్త వారితో ప్రయోగాలు చేయడంలోనూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ముందుంటారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ క్రేజీ చిత్రానికి సంబంధించి ఇచ్చిన అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది.
Also Read : Devara: తారక్ ఫ్యాన్స్.. ఆగస్టు 15న దేవర స్పెషల్ వీడియో వస్తోంది..
టిల్లు స్క్వేర్ సినిమాకు రైటర్‌గా, మ్యాడ్ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించి మెప్పించిన రవి ఆంథోని ఇప్పుడు డైరెక్టర్‌గా మారారు. దర్శకుడిగా రవి ఆంథోని కొత్త చిత్రానికి సంబంధించిన ఈ అప్డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ నటుడిగా అందరినీ ఆకట్టుకున్నారు. బబుల్ గమ్ సినిమాలో అద్భుతమైన నటనతో చైతు జొన్నలగడ్డ అందరినీ మెప్పించారు. ఇక తమ్ముడు సిద్దు బాటలోనే చైతు నడుస్తున్నారు. ఇప్పుడు చైతు జొన్నలగడ్డ కథ, స్క్రీన్ ప్లే, మాటల్ని కూడా అందిస్తున్నారు. రవి ఆంథోని దర్శకత్వం.. చైతు జొన్నలగడ్డ రైటింగ్‌తో.. ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో రాబోతోన్న ‘ధార్కారి #MM పార్ట్ 2’ అనే చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Double Ismart : రిలీజ్‌కు రెండు రోజులు.. ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..?
ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ మసాలా చిత్రమంటూ వదిలిన ప్రీ లుక్ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. హీరో ఎవరు? అనేది రివీల్ చేయకుండా.. డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ మెప్పిస్తోంది.. అందులో హీరో గోల్డ్ మెన్‌గా ఫుల్ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘ధార్కారి #MM పార్ట్ 2’ అంటూ ఈ పోస్టర్ మీద కనిపిస్తుండటం.. అసలు పార్ట్ వన్ అనేది లేకుండా.. ఇలా రెండో పార్ట్‌ను ప్రకటించడంతొ.. అందరిలోనూ ఆసక్తిని పెంచేసినట్టు అయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నారు.