NTV Telugu Site icon

టాక్ వచ్చిన.. వసూళ్లు ఆశించినంతగా లేవు!

థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించి చాలా కాలమే అవుతోంది.. స్టోర్ రూముల్లోనే దాగిన ఆ బోర్డులు ఏ పెద్ద హీరోనైన రాకపోతాడా.. మా దుమ్ము దులుపుకపోతారా..? అని ఎదురుచూస్తున్నాయి.. థియేటర్లు ఓపెన్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా పెద్దగా ప్రేక్షకుల హంగామా కనిపించలేదు. 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి వున్నా ప్రేక్షకుల లేక ఇంకా సీట్ల మధ్య సోషల్ డిస్టెన్స్ హే నడుస్తోంది. ఇక ఈ వీకెండ్ వసూళ్లు అయితే థియేటర్ల మైంటైన్ ఖర్చులకు కూడా సరిపొవట్లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాక సినీ అభిమానులు కాస్త ఫర్వాలేదనిపించారు. చాలా రోజుల నుంచి థియేటర్ స్క్రీన్ ఆనందాన్ని మిస్ అయ్యిన ప్రేక్షకులు సాదాసీదా టాక్ వచ్చిన సినిమాలను సైతం బాగానే ఆదరించారు. ఇక ఎస్ఆర్. కల్యాణమండపం, రాజ రాజ చోర సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో కాస్త పర్వాలేదనిపించాయి. అయితే ఈ సినిమా వసూళ్లు ప్రొడ్యూసర్లకు కాస్త ధైర్యానే ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు.

ఇక ఈ వీకెండ్ లో నైతే పరిస్థితి మరి దారుణంగా వుంది. శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాల కలెక్షన్స్ మొదటి రెండు రోజులు బాగానే వున్నా.. ఆ తర్వాత పూర్తిగా డల్ అయ్యిపోయాయి. పరిస్థితి ఇలానే ఉంటే థియేటర్ ఖర్చులు కష్టంగా ఉంటుందని యాజమాన్యాలు తెలుపుతున్నాయి. ఒక‌ప్ప‌టిలా థియేట‌ర్లు ఎప్ప‌టికీ క‌ళ‌క‌ళలాడ‌లాంటే పెద్ద సినిమాలు విడుదల కావాలంటున్నారు. ఈ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి.