Site icon NTV Telugu

Tollywood Box Office : 2004 సంక్రాంతి క్లాష్ 2026లో రిపీట్ అవుతుందా?

Tollywood 2026 Sankranti Clash

Tollywood 2026 Sankranti Clash

టాలీవుడ్‌లో పండుగ సీజన్‌ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తారు. ఆ క్రేజ్‌ దృష్ట్యా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు, ప్రముఖ బ్యానర్లు అన్నీ ఈ సీజన్‌లోనే తమ సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తుంటారు. కానీ ఇలాంటి హై వాల్యూ సీజన్‌లో ఎక్కువ సినిమాలు ఒకేసారి వస్తే అవి ఒకదానితో ఒకటి క్లాష్ అవ్వడం తప్పదు. అలాంటి క్లాష్‌లలోనే ఇప్పటికీ మర్చిపోలేని ఘట్టం 2004 సంక్రాంతి క్లాష్.

Also Read : Janhvi Kapoor : అతడే నా భర్త.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన జాన్వీ

ఆ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘అంజి’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అప్పటివరకు తెలుగు సినిమాలో పెద్దగా లేని గ్రాఫిక్స్ విజువల్స్, టెక్నికల్ హంగులు చూపించడంలో ఈ సినిమా ముందంజ వేసింది. అయితే, బాగా ఎక్స్‌పెక్ట్ చేసినంతగా సినిమా కనెక్ట్ అవ్వలేదు. ప్రేక్షకులు అంజిని చూసి నిరాశతో థియేటర్ల నుంచి బయటికి వచ్చారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహా’ కూడా బరిలోకి దిగింది. బాలయ్య స్టైల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా సగటు రేంజ్‌లో నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాల మధ్యలో, అప్పటివరకు స్టార్‌డమ్ కోసం కష్టపడుతున్న ప్రభాస్ తన ‘వర్షం’ సినిమాను రిలీజ్ చేశారు. అసలే కొత్త హీరోగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్‌కు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన కెరీర్ దిశ మలుపు తిరిగింది. అలా 2004 సంక్రాంతి క్లాష్ తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అదే సీన్ మళ్లీ 2026 సంక్రాంతిలో రిపీట్ అవుతుందా అన్న చర్చ సినీ సర్కిల్స్‌లో గట్టిగా నడుస్తోంది.

అవును ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే మూవీ సంక్రాంతి రేసులో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ‘రాజా సాబ్’ సినిమాను జనవరి 9న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇంతలోనే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ అనుకోకుండా వాయిదా పడింది. సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం ఇప్పుడు సంక్రాంతి సీజన్‌కి మళ్లే అవకాశం ఉంది. అంటే 2004లో లానే మళ్లీ చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ సినిమాలు ఒకేసారి బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. అంటే 2026 సంక్రాంతి కూడా తెలుగు సినిమా అభిమానుల కోసం ఒక మరపురాని బాక్సాఫీస్ ఫెస్టివల్ అవుతుందనడంలో సందేహం లేదు.

Exit mobile version