Site icon NTV Telugu

Tollywood: టాలీవుడ్ లో మరొక సిక్వెల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Untitled Design 2024 08 15t121359.284

Untitled Design 2024 08 15t121359.284

కొన్ని కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు అసలు ఈ సినిమా ఎప్పుడు మెుదలెట్టారు, ఎప్పుడు షూట్ చేసారు, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న సందేహం సామాన్య సినీ ప్రేక్షకులకు వస్తుంది. అలా చడీచప్పుడు లేకుండా షూట్ చేస్తుంటారు. అటువంటి విధంగానే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థ ఓ సనిమాను పూర్తి చేసింది. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసి మరింత ఆశ్చర్య పరిచింది.

Also Read: KALKI2898AD‌‌ : 50 రోజులు కంప్లిట్ చేసుకున్న రెబల్ స్టార్ కల్కి..

2019లో ఆస్కార్ మ్యూజిక్ డైరక్టర్ MM. కీరవాణి కొడుకు సింహా కోడూరి హీరోగా, కమెడియన్ సత్య ముఖ్యపాత్రలో ‘మత్తువదలరా’ అనే సినిమా ఒకటి వచ్చింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ హిటే సాధించింది. ముఖ్యంగా సత్య కామేడీ ఆడియన్స్ తో నవ్వులు పూయించింది. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని సక్సేస్ సాధించింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వేల్ రాబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. కాని షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఎంత వరకు చేసారు అని ఇటీవల కాలంలో కనీసం చిన్న న్యూస్ కూడా వినిపించలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని తెలుస్తుంది. కాగా ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. మత్తు వదలరా సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీస్ నిర్మించగా సెకండ్ పార్ట్ ను కూడా మైత్రీ నిర్మించగా కీరవాణి మరొక వారసుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version