NTV Telugu Site icon

Tollywood: మురారిని వెనక్కి నెట్టిన చిన్న సినిమా.. 3వ స్థానంలో మురారి..

Untitled Design 2024 08 11t075952.939

Untitled Design 2024 08 11t075952.939

వీకెండ్ రావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త కళకళలాడుతుంది చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సందడి ఓ మోస్తరులో కనిపించింది. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన మురారి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ నమోదు చేసింది. మరోవైపు జూన్ లో విడుదలైన రెబల్ స్టార్ కల్కి ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రాయన్ కు గుడ్ ఆక్యుపెన్సీ వుంది. ఈ సినిమాలతో పాటు కమిటీ కుర్రోళ్ళు, జగపతి బాబు ‘సింబా’, భవనమ్ వంటి సినిమాలు థియేటర్లోకి వచ్చాయి.

Also Read: Devara: తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి.. దేవర -2 దాదాపు లేనట్టే..?

దాదాపు అరడజనుకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా వాటిలో కేవలం  మూడు సినిమాలే కాస్త హడావిడి చేసాయి. చిన్న సినిమాగా రిలీజైన కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ తెచ్చుకుని దూసుకెళ్తుంది. ఇక మరో సినిమా రెబల్ స్టార్ కల్కి. పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో ఇప్పటికి తన రన్ కొనసాగిస్తున్నాడు కల్కి. ఇక ప్రిన్స్ మహేష్ బాబు మురారి రీరిలీజ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గడచిన 24 గంటల్లో బుక్ మై షోలో బుకింగ్స్ గమనిస్తే కమిటీ కుర్రోళ్ళు 30.54K, కల్కి 27.37K , మురారి 27.23K బుక్ అయ్యాయి. మౌత్ టాక్ తో కమిటీ కుర్రోళ్ళు మొదట ప్లేస్ లోసాగుతుంది. దాదాపు 50 రోజులకు దగ్గర అవుతున్న కల్కి ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మెచ్చుకోదగ్గ విషయమే. ఇక రిలీజ్ లో రికార్డు క్రియేట్ చేసి రీసెంట్ రిలీజ్ మూవీస్ కి పోటీగా కలెక్షన్స్ రాబడుతుంది మహేశ్ బాబు మురారి.

Show comments