ఆగస్టు 15న 4సినిమాలు గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసేసారు సదరు నిర్మాతలు. వీటిలో ముందుగా మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్ షోస్ ను ఒకరోజు ముందుగా అనగా 14న ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన టికెట్స్ కూడా రిలీజ్ చేశారు బచ్చన్ నిర్మాతలు. ఇక రామ్ పూరి జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ అన్ని తలనొప్పులు వదిలించుకొని రిలీజ్ కు రెడీగా ఉంది.
కాగా ఈ దఫా ఆగస్టు 15న రానున్న ఈ రెండు సినిమాలు అటు రవితేజకు, ఇటు రామ్ పోతినేనికి చాలా కీలకం. వీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోను హిట్టు కొట్టాలి.ముందుగా రవితేజ విషయం తీసుకుంటే ఈయనకు లాస్ట్ హిట్ సినిమా ధమాకా. ఆ తర్వాత చేసినటైగర్ నాగేశ్వరావు, ఈ ఏడాది రిలీజైన ఈగల్ రెండు వేటికవే ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో హిట్టు కొట్టి తీరాల్సిన పరిస్థితి. లేదంటే రవితేజ తరువాత సినిమాల బిజినెస్ ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది.ఇక రామ్ పోతినేని సంగతి కూడా దాదాపు ఇదే. రామ్ గత రెండు సినిమాలు స్కంద, వారియర్ వేటికవే పోటీపడి మరి ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తప్పక హిట్టు కొట్టాలి లేదంటే రామ్ కు కొంత ఇబ్బంది తప్పదు. ఈ చిత్ర దర్శకుడు పూరి కూడా ఈ సినిమాపై బోలెడంత నమ్మకం పెట్టుకున్నాడు. ఆయనకు హిట్టు కావాలి. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలు సూపర్ హిట్ సాధించి కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిద్దాం.