భార్య ఆర్తితో గతేడాది విడిపోతున్నట్లు ఎనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవిమోహన్. ఆ వెంటనే సింగర్ కెనీషాతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడంతో పెద్ద రచ్చ అయ్యింది. ప్రస్తుతం కోర్టులో ఈ ఫ్యామిలీ ఇష్యూ నడుస్తోంది. ఆర్తితో సెపరేట్ అయ్యాక జయం రవి పేరుని రవి మోహన్‌గా మార్చుకుంటున్నట్లు ఎనౌన్స్ చేసిన ఈ హీరో రీసెంట్ గా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసాడు. రవిమోహన్ స్టూడియోస్ సంస్థను ఏర్పాటు చేసి ఫ్యూచర్ కమిట్మెంట్స్ వెల్లడించాడు రవి.
ప్రజెంట్ టూ ప్రాజెక్ట్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఇచ్చాడు రవి మోహన్. తన ప్రొడక్షన్ హౌస్‌లో తనే హీరోగా బ్రో కోడ్ అనే ఫిల్మ్ చేయబోతున్నాడు. డిక్కిలోనా ఫేం కార్తీక్ యోగి దర్శకుడు. మలయాళ హీరో అర్జున్ అశోకన్ బ్రో కోడ్‌తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్ జే సూర్య కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ముగ్గురు భామలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు రవి. కన్నడ నుండి శ్రద్దా శ్రీనాథ్, మలయాళం నుండి మాళవిక మనోజ్, తెలుగు భామ శ్రీ గౌరీ ప్రియాతో జోడీ కడుతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు బ్రో కోడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేసారు. మలయాళ నటుడు అశోక్ అర్జున్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బ్రో కోడ్ ను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నాడు రవి మోహన్. మొత్తానికి కెరీర్ పరంగా న్యూ స్టెప్ తీసుకుంటోన్న రవి మోహన్.. 2025-2027లోపు తన ప్రొడక్షన్ హౌస్ నుండి టెన్ ఫిల్మ్స్ టార్గెట్‌గా పెట్టుకున్నాడు.
