NTV Telugu Site icon

మే 9న సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం ఫస్ట్ లుక్

Title & FIRST BANG of Sampoornesh Babu revealing on May 9th

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సంపూర్ణేష్ బాబు 5వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడట. మే 9న ఉదయం 9 గంటల 11 నిమిషాలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. బర్నింగ్ స్టార్ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి. చివరిసారిగా ‘కొబ్బరి మట్ట’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబు ‘టక్కరి దొంగ చక్కని చుక్క, రాధాకృష్ణ’ చిత్రాల్లో నటిస్తున్నాడు.