NTV Telugu Site icon

బాలీవుడ్ లవ్​బర్డ్స్ పై కేసు నమోదు

బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్​, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్​లో లవ్​బర్డ్స్​గా ఉన్నారనే వార్తలు తరుచు బీటౌన్ లో వినిపిస్తూనే వున్నాయి. టైగర్​, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్​లో ఉన్నారనే ప్రచారం పెద్దగానే జరుగుతోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. జిమ్ చేసిన తర్వాత అలా సేదతీరేందుకు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ముంబై పోలీసులు టైగర్ ష్రాఫ్​, దిశా పటానీని బాంద్రా వద్ద ఆపారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు. అయితే సరైన కారణం లేకుండా ఇలా బయటకు రావడం లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్న పోలీసులు వారిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.