Site icon NTV Telugu

‘Thug Life’ : కమల్ హాసన్ మాటలు.. నా తండ్రి రాజ్‌కుమార్‌‌ని గుర్తుచేశాయి

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్‌ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే హీరోలో సైతం ఆయనకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రజంట్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ మూవీ నటించాడు. త్రిష, శింబు వంటి స్టార్స్ అందరూ భాగం కాబోతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో ఈవెంట్‌లో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివరాజ్ కుమార్, తన అభిమాన నటుడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Also Read : Pawan Kalyan : ‘OG’ మూవీలో మరో హీరోయిన్..!

‘ఒకసారి కమల్ స‌ర్‌ మా ఇంటికి వచ్చారు. నాన్నగారితో మాట్లాడుతుంటే నేను పక్కన నిలబడి ఆయన్నే చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన నన్ను చూసి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఆయన్ని కౌగిలించుకోవచ్చా అని అడిగాను, ఆయన నవ్వుతూ సరే అన్నారు. ఆ తర్వాత నేను మూడు రోజుల వరకు స్నానం చేయలేదు. ఆయన వాసన నాపై అలాగే ఉండాలని. ఆయనంటే నాకు అంత అభిమానం. అలాగే నేను క్యాన్సర్‌తో పోరాడుతున్న స‌మ‌యంలో కమల్ హాసన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఎప్పటికి మర్చిపోలేను. నాకు నా తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్‌తో మాట్లాడినట్లు అనిపించింది’ అని శివరాజ్ కుమార్ వెల్లడించారు.

Exit mobile version