Site icon NTV Telugu

Karnapisachi : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘కర్ణ పిశాచి’

Karna

Karna

తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం కర్ణ పిశాచి శనివారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. SBK DREAM FILMS భరత్ సిగిరెడ్డి నిర్మించగా విజయ్ మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భరత్ సిగిరెడ్డి, , ప్రణవి, రమ్య, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికొస్తే, ఓ యువకుడు ప్రేమలో, జీవితంలో విఫలమై, తాగుబోతుగా మారుతాడు. అలాంటి సమయంలో అతనికి తన పూర్వీకులకు సంబంధించిన ఓ పురాతన గ్రంథం లభిస్తుంది. ఆ పుస్తకం కారణంగా అతని జీవితంలో సంభవించిన అనూహ్య మార్పులు, ఎదురైన సంఘటనలే ఈ చిత్రం యొక్క కథాంశం.

Exit mobile version