NTV Telugu Site icon

Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా

Tillu Square

Tillu Square

డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తామని అప్పట్లోనే ప్రకటించాడు. ఆ ప్రకటించిన విధంగానే టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మల్లిక్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాని నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళి, సినిమా మీద ఆసక్తి కూడా పెంచేసింది. మరి ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సినిమాలో కొన్ని ఆసక్తికర అంశాలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

Also Read: Tillu Square Review: టిల్లు స్క్వేర్ రివ్యూ

అదేమిటంటే ఈ సినిమాలో డీజే టిల్లు సినిమాలో హీరోయిన్గా నటించిన నేహా శెట్టి ఒక గెస్ట్ రోల్ చేసింది. ఆమె తన రాధిక పాత్రలోనే మరోసారి ఈ సినిమాలో కనిపించింది. కనిపించింది కొద్దిసేపు అయినా సరే ఆమె ఒక్కసారిగా థియేటర్లో అరుపులు పెట్టించింది అంటే ఆమె క్యారెక్టర్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రతో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించింది. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు తెలుగు అమ్మాయిగా పలు సినిమాలు చేసిన ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా లాంటి సినిమా చేసిన ఈ భామ ప్రస్తుతానికి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో ఆమె కనిపించడం గమనార్హం. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ప్రధానమైన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అంటే మొత్తం మీద ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించారు అన్నమాట.

Show comments