Site icon NTV Telugu

Tollywood : ఈ ఏడాది ఇంకా రూ. 500 కోట్ల టార్గెట్ రీచ్ కానీ టాలీవుడ్.. OG ఆ మార్క్ ను అందుకుంటుందా?

Tollywood

Tollywood

లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర టాలెంట్ చూపిన టాలీవుడ్ ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో రూ. 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్ ఈ ఏడాది థౌజండ్ సంగతి పక్కన పెడితే రూ. 500 క్రోర్ కూడా రీచ్ కాలేకపోయింది. బాలీవుడ్ ఇప్పటికే ఛావాతో పాటు చిన్న సినిమా సైయారాతో రూ. 500 క్రోర్ ప్లస్ కలెక్షన్లను చూసేసింది. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్ 2, లోక రూ. 250 ప్లస్ కలెక్షన్లతో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ. సౌత్‌లోని ఇతర ఇండస్ట్రీలకు టార్చ్ బేరరైనా టాలీవుడ్ మాత్రం ఈ ఏడాది టాస్క్ కంప్లీట్ చేయడంలో చతికిలపడుతోంది.

Also Read : Mollywood : నిన్నటితో రూ.100కోట్ల వసూళ్లు.. నేడు ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ ఏడాది టాలీవుడ్‌లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి. కానీ రీజనల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాంని బీట్ చేయలేకపోయాయి. రూ. 300 కోట్లతో 2025లోనే హయ్యెస్ట్ గ్రాసర్ తెలుగు చిత్రంగా మారిన వెంకీ మూవీని ఈ 9 మంత్స్‌లో కనీసం ఒక్క లోకల్ ఫిల్మ్ టచ్ చేయలేదు. గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, హిట్3, కుబేర, హరి హర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ పది పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నంబర్ కోసం ట్రై చేశాయి కానీ రూ. 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి.  టాలీవుడ్‌కు ఇక మిగిలింది మూడు నెలలు మాత్రమే. ఈ త్రీ మంత్స్‌లోనే ఫ్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇందు కోసం ప్రిపేరవుతున్నాయి కొన్ని ఎంగేజింగ్ ఫిల్మ్స్. ఆల్రెడీ ఓజీ ఫిల్మ్ థియేటర్లలో సందడి షురూ చేసింది. హరి హర వీరమల్లుతో ప్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఆ లెక్క సరిచేయాలనుకుంటున్నాడు. తొలిరోజు సుమారుగా రూ. 150 కోట్ల ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉన్న OG లాంగ్ రన్ లో రూ. 500 మార్క్ అందుకుంటుందేమో చూడాలి.

Exit mobile version