Site icon NTV Telugu

బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ

This Onam Watch Kuruthi On Aug 11 in Prime

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన “కురుతి” చిత్రం ఆగస్టు 11 నుండి డైరెక్ట్ ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది. మను వారియర్ దర్శకత్వం దర్శకత్వంలో అనీష్ పల్యాల్ రచించగా, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుప్రియ మీనన్ నిర్మించిన ఈ చిత్రం గురించి మాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మలయాళ థ్రిల్లర్‌లో రోషన్ మాథ్యూ, శ్రీందా, షైన్ టామ్ చాకో, మురళి గోపీ, మముక్కోయా, మణికంద రాజన్, నస్లెన్, సాగర్ నవాస్ వల్లిక్కున్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also : ఎల్లో టాప్ లో… ఏంజిల్ ఆర్న!

ఇటీవలే “కోల్డ్ కేస్”తో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ఓటిటిలోనే రిలీజ్ అయ్యింది. మరోసారి పృథ్వీరాజ్ ఓటిటి బాట పట్టడం విశేషం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ “కురుతి” అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రం కథ సరిహద్దులు దాటిన మానవ సంబంధాలు, ద్వేషం, పక్షపాతం వంటి వాటిపై పోరాటం. “కురుతి” మే 13, 2021న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కాని కరోనా మహమ్మారి కారణంగా మేకర్స్ దానిని వాయిదా వేయాల్సి వచ్చింది.

Exit mobile version