హనుమాన్ మూవీతో తేజ సజ్జా ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయ్యాడు. తన నెక్ట్స్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేలా ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నఈ సినిమాలో తేజ ఓ యోధుడిగా కనిపించాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ తోనే అంచనాలను అమాంతం పెంచేశారు.
Also Read : Prabhas : అప్పుడు కన్నప్ప.. ఇప్పుడు మిరాయ్.. కరుణామయుడు రెబలోడు
ఈ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మిరాయ్ దూసుకెళ్తోంది. సూపర్ యోధగా తేజ అదరగొట్టాడు. సినిమా చివర్లో మిరాయ్ 2 ను ప్రకటించారు. మిరాయ్ 2 కు టైటిల్ గా ‘మిరాయ్ జైత్రయా’ ను ప్రకటించారు. అలాగే ఈ సీక్వెల్ లో విలన్ గా రానా దగ్గుబాటి కనిపించబోతున్నాడు. అయితే మరి ఈ సీక్వెల్ ను ఎప్పుడు తీసుకువస్తారు అనేది చూడాలి. తేజా సజ్జా ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కనిపించేది కొంతసేపైనా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే జంబిరెడ్డి కి సీక్వెల్ గా జాంబిరెడ్డి 2 ను ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియానే చేస్తోంది. ముందు జై హనుమాన్, జాంబీ రెడ్డి సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు తేజ. మరి ఈ లెక్కన మరి లెక్కన మిరాయ్ పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతోందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
