Site icon NTV Telugu

Akhanda2 : అఖండ- 2 రిలీజ్ వాయిదాకి అసలు కారణం ఇదే

బాలయ్య – బోయపాటిల క్రేజీయెస్ట్ ఫిల్మ్ అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవడంతో మరి గంటల్లో రిలీజ్ అవుతుందనగా రిలీజ్ వాయిదా పడింది. టికెట్స్ బుక్ చేసుకున్న వారికి సైతం డబ్బులు తిరిగి చెల్లించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను అఖండ 2 షోస్ క్యాన్సిల్ చేశారు. రిలీజ్ వాయిదా వేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఆందోళనలో చెందుతున్నారు.

Also Read : Akhanda2Thaandavam : అఖండ 2 రిలీజ్ వాయిదా వేసినందుకు మమ్మల్ని క్షమించండి : 14 రీల్స్ ప్లస్

కాగా ఈ సినిమా వాయిదా పడడానికి అసలు కారణం సంకేతిక సమస్యలు కాదు. ఈ చిత్ర నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంట గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 1నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాలను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్ నౌ తో బాగస్వామ్యంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. కానీ రెండు సినిమాలు కూడా దారుణంగా ప్లాప్ అయ్యాయి. అప్పటి నుండి 14 రీల్స్ కు ఈరోస్ నౌ మధ్య ఆర్థిక లావాదేవిలా విషయంలో ఇష్యూ నడుస్తోంది. ఈరోస్ కు రూ. 27. 8 కోట్ల రూపాయలు 14 రీల్స్ బకాయి ఉంది. ఈ వివాదాన్నీ పరిష్కరించచకుండా 14 రీల్స్ ప్లస్ అని మరొక బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు రామ్ ఆచంట, గోపి ఆచంట. కొన్ని సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న ఈరోస్ ఇప్పడు అదును చూసి 14 రీల్స్ మేకర్స్ పై మద్రాసు కోర్టులో కేసు వేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఈరోస్ కు అనుకూలంగా రావడంతో అఖండ 2 రిలీజ్ ఆగింది.

Exit mobile version