NTV Telugu Site icon

Devara : ఇంతకీ ఎన్టీయార్ అన్నది ఎవరినుద్దేశించి.. ఇప్పుడిదే చర్చ..?

Devara Sucess

Devara Sucess

యంగ్ టైగర ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్ర విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యడు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. సైఫ్ అలీఖాన్ కు తెలుగులో ఫస్ట్ హిట్ దక్కింది. తొలిరోజు నుండి దేవర భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా దేవర రూ. 407 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. దేవర భారీ విజయాన్ని పురస్కరించుకుని గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు నిర్మాతలు.

Also Read : TTD: టీటీడీ బోర్డు మెంబర్ గా టాలీవుడ్ నుండి ఎవరు..?

కాగా ఈ వేదికపై జూనియర్ ఎన్టీయార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీయార్ ఆర్ట్స్ మాట్లాడుతూ ” ముందుకు ఎప్పుడు రాడు,  చాలా మంది అతనిని సరిగా అర్ధం చేసుకోరు అతడే మా కొసరాజు హరికృష్ణ. ఎవరేమి అన్నా, అనుకున్న సరే ఎన్టీయార్ ఆర్ట్స్ కు మూలస్తంభం హరి. నాకు కళ్యాణ్ అన్నకి స్ట్రెంత్ హరి, నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు లేదా లేదు” అని అన్నారు.  హరి వచ్చాకే ఫ్యాన్స్ కు తారక్ కు మధ్య గ్యాప్ వచ్చిందని ఎప్పుడో నుండో టాక్ ఉంది. హరి ని తీసేయాలని ఫ్యాన్స్ ఆ మధ్య గొడవ చేసారు. దేవర ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ‘X’ లో స్పేస్ లు పెట్టి మరి హరిని తిట్టారు. బహుశావారందరికి ఆన్సర్ ఈ రూపంలో తారక్ చెప్పాడని టాలీవుడ్ లో   చర్చించుకుంటున్నారు

Show comments