NTV Telugu Site icon

మహేష్ షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశ… !

There won't be any updates from Sarkaru Vaari Paata team on May 31st

ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల అప్డేట్స్ ఉంటాయని ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అభిమానుల కోసం ఏదైనా ప్రత్యేకత ఉండేలా చూసుకునే మహేష్ ఈ సంవత్సరం మాత్రం దానిని దాటవేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా మహేష్ బాబు కుటుంబానికి సన్నిహితుడైన బిఏ రాజు ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. మే 31న బిఏ రాజు పదకొండవ రోజు వేడుక. దీంతో “సర్కారు వారి పాట” సినిమా నుంచి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అప్డేట్ ఉండబోదని మహేష్ బాబు టీం ప్రకటించింది. మరి మిగతా సినిమాల అప్డేట్స్ కూడా ఉండనట్లే… ఇది మహేష్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి.