పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటీకే రిలీజ్ అయిన OG ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గ్లిమ్స్ సంగతి సరే సరి. ఎక్కడ చుసిన ఇప్పడు అంత OG హైప్ నడుస్తోంది. ఇంతటి హైప్ ఉన్న ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.
Also Read : Tollywood : సూపర్ హిట్ సినిమా బ్యూటీని పక్కన పెట్టేసిన టాలీవుడ్
కాగా నేడు ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ కాన్సర్ట్ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరగబోతుంది. అయితే ఈ ఈవెంట్ పాస్ ల కోసం డిమాండ్ మాములుగా లేదు. ఎలాగైన సరే ఈవెంట్ కు వెళ్లాలని ఫ్యాన్స్ ఎంట్రీ పాస్ ల కోసం ఎగబడుతున్నారు. డిమాండ్ ఉండడంతో కొందరు ఈ పాస్ లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. నేడు జరగబోయే ఎల్బీ స్టేడియం ఈవెంట్ ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్. కారణం ఏంటంటే 2011లో పవర్ స్టార్ నటించిన పంజా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆడియో ఫంక్షన్ ఒక హిస్టరీ. స్టేడియం లోపల ఎంత మంది ఉన్నారో దానికి నాలుగింతలు బయట రోడ్ పై ఉండిపోయారు. లోపలా, బయట జనాలతో కిక్కిరిసిన ఆ ఫంక్షన్ గురించి చాలా రోజులు మాట్లాడుకునే వారు. ఇక యువన్ శంకర్ రాజా పాటలు ఒక ఊపు ఊపేశాయ్. ఎక్కడ చూసినా నీ చుర చుర చూపులే పంజా అంటూ ఆ పాటే వినిపించేది. మళ్ళీ చాలా కాలం తర్వాత పవర్ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎల్బీ స్టేడియంలో జరగడం విశేషం. అప్పట్లో పంజాకు ఎంతటి హైప్ ఉందొ ఇప్పుడు OGకు అంతే హైప్ ఉంది. సాయంత్రం 5 గంటలకు మొదలుకాబోతున్న ఈ కాన్సర్ట్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ వేలాదిగా తరలిరాబోతున్నారు. ఈ నేపధ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసారు పోలీసులు.
