నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ సినిమా మంచి మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. నిజానికి ఈ సినిమాని హోంబాలే ఫిల్మ్ సంస్థ ప్రజెంట్ చేసింది. క్లీమ్ స్టూడియోస్ అనే సంస్థ ఈ యానిమేటెడ్ సినిమాని హోంబాలే దగ్గరికి తీసుకొచ్చి సపోర్ట్ చేయమని అడగడంతో హోంబాలే ముందుకు వచ్చింది. అయితే హోంబాలే తీసుకున్న నిర్ణయం నోటికి నూరు పాళ్ళు సరైనదే అని నిన్న సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థమైంది. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్ అలా ఉంది. ముఖ్యంగా వరాహ అవతారం ఎపిసోడ్‌తో పాటు సినిమా చివరి అరగంట ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా చేయడంలో సక్సెస్ అయింది.
Also Read : Vishwambhara : రామ్ చరణ్ వల్లే విశ్వంభర ఓకే అయిందా.. డైరెక్టర్ క్లారిటీ..
యానిమేటెడ్ కంటెంట్‌లా కాకుండా ఇదేదో స్ట్రైట్ కమర్షియల్ సినిమా అనేలా థియేటర్లలో ఈలలు వేస్తూ అరుస్తూ గోల చేస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి హరిహర వీరమల్లు సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయించిన నేపథ్యంలో ఈ సినిమాకి భారీగా థియేటర్లు దక్కలేదు. కానీ హరిహర వీరమల్లు టాక్ కాస్త నెగటివ్‌గా రావడంతో ఆ సినిమాకి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి థియేటర్లు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ చేసిన గీతా సంస్థ ఈ సినిమాకి థియేటర్లు పెంచే విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అశోక్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటోంది.
