NTV Telugu Site icon

Tollywood : ఈ వారం చిన్నసినిమాల సందడి!

Tollywood

Tollywood

Tollywood : సహజంగా సినిమాలు శుక్రవారం నాడు విడుదల అవుతాయి. అయితే ఈ వారం మధ్యలో దీపావళి పండగ రావడంతో కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ ముందుకొచ్చేశాయి. వీకెండ్ లో కాకుండా వారం ప్రారంభంలోనే రెండు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అలా ఈ నెల 25న అక్షయ్ కుమార్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించిన ‘రామ్ సేతు’ హిందీ మూవీ తెలుగులో డబ్ అయ్యి విడుదలైంది. అదే రోజున మరాఠీ చిత్రం ‘హర హర మహాదేవ్’ కూడా రిలీజ్ అయ్యింది. దీన్ని కూడా తెలుగులో డబ్ చేసినట్టు చెప్పారు కానీ తెలుగు వర్షన్ ఎక్కడా ప్రదర్శిస్తున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే… ఈ నెల 27న ‘నిన్నే చూస్తు’ మూవీ జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన హేమలతా రెడ్డి దీని నిర్మాత కూడా కావడం విశేషం. శ్రీకాంత్ గుర్రం, హేమలతా జంటగా కె. గోవర్థన రావు ఈ సినిమాను తెరకెక్కించారు. సుహాసిని, సుమన్, భానుచందర్, షాయాజీ షిండే, కిన్నెర తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

read also: Green India Challenge: ఎంపీ సంతోష్ కుమార్‌ స్ఫూర్తి.. 80 వేల మొక్కలు నాటిన గ్రామస్తులు..

28వ తేదీ శుక్రవారం నాడు రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు, ప్రేమ, తులసి కీలక పాత్రలు పోషించిన ‘అనుకోని ప్రయాణం’ మూవీ రిలీజ్ అవుతోంది. దీన్ని వెంకటేశ్ పెదిరెడ్ల దర్శకత్వంలో డాక్టర్ జగన్ మోహన్ నిర్మించారు. బెక్కెం వేణుగోపాల్ ఈ మూవీకి సమర్పకుడు. ఇదే రోజున అవార్డ్ మూవీస్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన ‘వెల్కమ్ టూ తీహార్ కాలేజ్’ మూవీ రిలీజ్ అవుతోంది. అలానే శ్రీరామ్ నిమ్మల , ఎల్సా ఘోష్ , శుభశ్రీ సోనియా హీరో హీరోయిన్లు గా నటించిన ‘రుద్రవీణ’ చిత్రం విడుదల కాబోతోంది. దీన్ని మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను నిర్మించారు. ఇదే రోజున అమ్రేష్ రాజును హీరోగా పరిచయం చేస్తూ సునీల్ పొన్నం రూపొందించిన ‘ఐడెంటిటీ’ మూవీ వస్తోంది. ఇందులో ఖుషీ ఆనంద్, భాగ్యలక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. అలానే విజ‌య్ శంక‌ర్, ‘బిగ్‌బాస్’ ఫేమ్‌ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్నచిత్రం ‘ఫోక‌స్’ కూడా 28వ తేదీనే విడుదల కాబోతోంది. సుహాసిని, భానుచంద‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమాను జి. సూర్య‌తేజ దర్శకత్వంలో వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ నిర్మించారు. ఇదో మర్డర్ మిస్టరీ బేస్డ్ న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్.

Read also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై మేం మాట్లాడం..!

థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాల విశేషాలు ఇలా ఉంటే… ప్రముఖ నటుడు అలీ నిర్మించిన ‘అందరూ బాగుండాలి… అందులో నేనుండాలి’ మూవీ ఆహాలో 28వ తేదీ డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళ చిత్రం ‘వికృతి’ ఆధారంగా ఈ సినిమాను అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ తెలుగులో రీమేక్ చేశారు. ఆయనతో పాటు ఇందులో నరేశ్, మౌర్యాని, పవిత్ర లోకేష్ కీలక పాత్రలు పోషించారు.
Sivakarthikeyan: ‘ప్రిన్స్’ విషయంలో ‘అను’భవమైంది

Show comments