NTV Telugu Site icon

Trailer : ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకుంటున్న ‘కోర్ట్‌’ ట్రైలర్‌..

Cort Movie

Cort Movie

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’. రామ్‌ జగదీశ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీలో హర్ష్‌ రోషన్, శ్రీదేవి జంటగా న‌టించగా. ప్రియ‌ద‌ర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

Also Read: NTR Fan : తారక్ అభిమాని మృతి

కాగా ఏ నమ్మకంతో ‘కోర్ట్’ చిత్రం ప్రేక్షకులకు నచ్చకపోతే తన నెక్స్ట్ మూవీ ‘హిట్-3’ చూడొద్దంటూ నాని కామెంట్ చేశాడో.. ట్రైలర్ చూస్తే ఈ సినిమాపై నానికి ఎంత కాన్ఫిడెంట్ ఉందో అర్థం అవుతుంది. నిజంగానే మూవీ కథ ప్రకారం కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంది. త‌న కూత‌రుని ప్రేమించాడ‌న్న కార‌ణంతో, ఒక తండ్రి ఆ యువ‌కుడిని జైలులో వేయించి. బ‌య‌టికి రాకుండా త‌న జీవితం నాశ‌నం చేయాల‌నే పాయింట్‌తో, ఈ సినిమా రాబోతుంది. ఇక ఆ యువ‌కుడికి శిక్ష పడకుండా ప్రియ‌ద‌ర్శి ఎలాంటి న్యాయం పోరాటం చేశాడు అనేదానితో ట్రైల‌ర్‌ ఇంట్రస్టింగ్‌గా కట్ చేశారు. టోటల్ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.