Sai Pallavi : తెలుగు ప్రేక్షకులు చాలా మంచోళ్ళు. ఏ భాష నుంచి వచ్చినా ఆదరిస్తారు
- శివకార్తికేయన్ లేటెస్ట్ సినిమా అమరన్
- తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా నిలిచిన అమరన్
- గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించిన శ్రేష్ట్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమాను హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేసారు.
Also Read : VenkyAnil3 : అరకులోయలో విక్టరీ వెంకటేష్ యాక్షన్..
Also Read
ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ కావడంతో పంపిణీదారులైన శ్రేష్ట్ మూవీస్ నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శివకార్తికేయన్ తో పాటు హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి పాల్గొన్నారు. సక్సెస్ వేదికపై సాయి పల్లవి మాట్లాడుతూ ” శివకార్తీకేయున్ ను తమిళంలో ‘పక్కింటి అబ్బాయ్’ అని పిలుస్తారు. అలాగే అమరన్ సినిమాలో అద్భుతంగా నటించి టాలీవుడ్ లో మన ఇంటి అబ్బయ్ అయ్యాడు. నిన్న అయన నాతో మాట్లాడుతూ తమిళ్ లో నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నీతో వచ్చింది అని అన్నారు. ఈ వేదికపై చెప్తున్నాను ఆయనకు తమిళ్ లోనే కాదు తెలుగులో బ్లాక్ బస్టర్ కూడా నాతోనే రావడం చాలా సంతోషంగా ఉంది. దీని తర్వాత శివ కార్తికేయన్ సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అవుతాయి. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకు అంటే టాలీవుడ్ ప్రేక్షకులు మంచి సినిమా వస్తే అది ఏ హీరో సినిమా, ఏ ఇండస్ట్రీ అనేది చూడరు, ఇటీవల తమిళ్ హీరో సూర్య వచ్చినప్పుడు ఇక్కడి వాళ్ళు ఎంతో ప్రేమ చూపించారు, అంత మంచోళ్ళు తెలుగు ప్రేక్షకులు” అని అన్నారు
#Amaran సక్సెస్ మీట్..
శివకార్తికేయన్ పక్కింటి కుర్రాడు..
తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళు.. – Sai pallavi #AmaranMajorSuccess
— తార-సితార (@Tsr1257) November 6, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!