NTV Telugu Site icon

Manchu Vishnu : అడవి పందులను వేటాడిన వివాదంలో మంచు విష్ణు సిబ్బంది

Vishnu Manchu

Vishnu Manchu

మంచు ఫ్యామిలీ తీరు రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల మంచు విష్ణు, మనోజ్ జల్ పల్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. అటు మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో  ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోసారి మంచు బ్రదర్స్ ఏదైనా హంగామా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పోలీసులు ఆదేశాలను మంచు విష్ణు అనుచరులు పట్టించుకోవట్లేదు.

Also Read : Naga Vamsi : ‘అర్జున్ రెడ్డి’గా స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ

అందుకు తాజాగా జరిగిన ఉదంతమే ఉదాహరణ. మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. మెహన్ బాబు నివాసం జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించారు విష్ణు సిబ్బంది. జల్ పల్లిలోని చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి  తీసుకువచ్చాడు మంచు విష్ణు మేనేజర్ కిరణ్. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లాడు ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్. గతంలోను వీరు ఇలాగె చేసే వారని ఇద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరం చెప్పిన మంచు మనోజ్. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని మనోజ్ హెచ్చరించిన పట్టించుకోని మేనేజర్, ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా పాటలు పాడుకుంటూ అడవి పందులను తీసుకువెళ్తున్నారు మంచు విష్ణు అనుచరులు.  అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్.

Show comments