NTV Telugu Site icon

Odela 2: అదిరిపోయిన ‘ఓదెల 2’ టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో

February 7 2025 02 22t092140.055

February 7 2025 02 22t092140.055

కరోనా టైంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ సినిమాకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ సినిమా రూపొందుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తుంది.సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్ అయింది.

Also Read:unni mukundan: శృంగార సన్నివేశాలకు మొహమాటం లేకుండా నో చెప్పేస్తా..

ఫిబ్రవరి 22న కుంభమేళాలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం. ఇక ఈ రోజే టీజర్ విడుదల కావడంతో మూవీ టీం ఈవెంట్ స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉండగా.. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ టీజర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అంచనాలు పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ టీజర్ కట్‌ను మేకర్స్ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారట.

https://www.youtube.com/live/MHeWQSghQn8?si=QBEA-PFaY_jXKQzG