Site icon NTV Telugu

The Raja Saab: ‘రాజాసాబ్’పై పుకార్లు.. స్పందించిన టీమ్

Raja Saab Prabhas

Raja Saab Prabhas

ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి కానీ గత కొన్ని రోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నా ఈరోజే అదే డేటును సిద్ధూ జొన్నలగడ్డ జాక్ కూడా ఫిక్ చేసుకుంది. కాబట్టి వాయిదా గురించి అధికారికంగా చెప్పకపోయినప్పటికీ దాదాపు వాయిదా పడ్డట్టే అని ప్రచారం జరుగుతుంది. రెండు రోజుల క్రితం ప్రభాస్‌కు ఈ మూవీ షూటింగ్‌లో కాలు బెణికిందని న్యూస్ వచ్చింది, కాబట్టి సినిమా ఏప్రిల్ 10కి రిలీజ్ కాదని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టీం స్పందించింది.

Allu Aravind: అల్లు అర్జున్ కిమ్స్ కు రాకపోవడంపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

ఇక రాజా సాబ్ షూటింగ్ నిరంతరాయంగా డే అండ్ నైట్ షెడ్యూల్స్‌తో శరవేగంగా జరుగుతోంది. దాదాపు 80% షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ విడుదల గురించి రకరకాల ఊహాగానాలు చెలామణి అవుతున్నాయని మేము గమనించాము. ఈ తప్పుడు పుకార్లను నమ్మవద్దని కోరుతున్నాము. సరైన సమయంలో మేము ఏవైనా అప్డేట్స్ ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. రెబెల్ సాబ్ రాక కోసం మీరు చూసే ఎదురు చూపులకు ఏమీ తక్కువ కాదు. మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసేలా టీజర్ త్వరలో రాబోతోంది అని చెప్పుకొచ్చారు. రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తారనుకుంటే టీజర్ అప్డేట్ ఇచ్చి సరిపెట్టారు మేకర్స్.

Exit mobile version