Tamannaah : ఓదెల రైల్వేస్టేషన్ -2 నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్..
- తమన్నా తాజా చిత్రం ఓదెల -2
- కథ అందించిన సంపత్ నంది
- రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ బహుభాషా చిత్రం ఒదెల 2. తమన్నా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఒదెలా-2. 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఒడెలా రైల్వే స్టేషన్‌కి కొనసాగింపుగా రానుంది ఈ ఒదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ మరియు బి హైండ్ సీన్స్ వీడియో అటు తమన్నా అభిమానుల్లో ఇటు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్‌లో క్లైమాక్స్ షూటింగ్‌తో జరుగుతోంది. ఈ చిత్రంలో వచ్చే అత్యంత కీలకమైన ఆలయ సన్నివేశాలను తెరకెక్కించేందుకు అధిక బడ్జెట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు తమన్నా మరియు ఇతర నటీనటులు ప్రసుతం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
Also Read
కాగా హైదరాబాద్ బోనాలు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టుకుని, తమన్నా భాటియా తలపై బోనం తీసుకు వెళుతున్న పోస్టర్ చూడ చక్కగా ఉంది. యాదృచ్ఛికంగా బోనాల సంబరాలు జరుగుతున్నప్పుడు బోనాల ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు ఓదెల యూనిట్. బలమైన కథా,కథనంతో భారీ యాక్షన్‌ను మిళితం చేయడంలో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది. అతని పర్యవేక్షణలో నిర్మిచబడుతున్న ఒడెలా-2 సినీ ప్రేక్షకులను అలరిస్తుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా సిటిమార్, రచ్చ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.
Also Read: Gauthami : అందమే అసూయాయపడేలా హొయలు పోతున్న గౌతమి కూతురు..త్వరలోనే హీరోయిన్ గా
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!