D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు

D56 (2)

D56 (2)

వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ మరో సినిమాను స్టార్ట్ చేసాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కోలీవుడ్ లో సంచలన విజయం సాధించిన స్పోర్ట్స్ డ్రామా ‘లబ్బర్ పందు’. థియేట్రికల్ గా సూపర్ హిట్ అయిన ఈ చిత్రంతో ఆడియెన్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు . ధనుష్‌ కోసం ఒక పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ‘సార్’ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి విజయాన్ని అందించిన సితార ఎంటెర్టైనమెంట్స్ ఈసారి ధనుష్‌తో పాన్-ఇండియా హిట్ ఇచ్చేందు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ధనుష్‌ మార్క్ పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్, తమిళరసన్ పచ్చముత్తు మార్క్ టేకింగ్, సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన కథానాయికగా ప్రీతి ముకుందన్  నటిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో వైవిధ్యమైన నటుడు ఎస్.జె. సూర్య మరియు హాస్య నటుడు వడివేలు  కనిపించనున్నారు. అలాగే ఉరియాడి సినిమాతో హీరోగా దర్శకుడిగా పేరుతెచ్చుకున్న విజయ్ కుమార్ విలన్ గా నటించబోతున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సంచలనం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.