The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్‌ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!

The Paradise

The Paradise

The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ థియేటర్ల వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద పిల్లర్‌గా నిలిచింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాల్సిన ఒక సంచలన పాట చివరి నిమిషంలో మిస్సయిందన్న షాకింగ్ నిజాన్ని స్వయంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తాజాగా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో నిర్వహించిన స్పెషల్ చిట్‌చాట్‌లో బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఆడియన్స్‌కి థియేటర్స్‌లో మిస్సైన ఆ సాంగ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ అయిన టైంలో ఆడియన్స్‌కి అందించాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు చెప్పారు.

తాజా ఇంటర్వ్యూలో లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో కలిసి పాల్గొన్న శ్రీకాంత్ ఓదెల సిల్వర్ స్క్రీన్‌పై మిస్సయిన ఆ పవర్‌ఫుల్ సాంగ్ వెనుక అసలు విషయాన్ని చెప్పారు. “సినిమాలో ‘దేశం’ కాన్సెప్ట్‌తో సాగే ఒక అదిరిపోయే నంబర్ ఉంది. ఆ పాట గనుక థియేటర్‌లో పడి ఉంటే స్క్రీన్లు తగలబడిపోయేవి. ప్రేక్షకుల ఈలలు, గోలతో థియేటర్లు దద్దరిల్లేవి. కానీ రిలీజ్ టైంకి అనిరుధ్‌పై విపరీతమైన వర్క్ లోడ్ పడింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చెక్కే పనిలో అనీ తలమునకలయ్యారు. లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ఆ పాటను పూర్తిస్థాయిలో రికార్డ్ చేసి, ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేసేందుకు టైం ఏమాత్రం సరిపోలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాటను పక్కన పెట్టాల్సి వచ్చింది” అని శ్రీకాంత్ వివరించారు. వెండితెరపై అభిమానులకు చూపించలేకపోయిన ఆ సెన్సెషనల్ సాంగ్‌ను ఇప్పుడు ఓటీటీ వేదికగా అందించేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు శ్రీకాంత్ ఓదెల చెప్పారు. రచించారు. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కోసం ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ ట్రాక్ స్థానంలో, రికార్డింగ్ పెండింగ్‌లో ఉన్న ఆ ‘దేశం’ పాటను రీప్లేస్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. దీనికోసం అనిరుధ్‌తో ప్రత్యేకంగా లైవ్ రికార్డింగ్స్ చేయించి, ఫుల్ వెర్షన్‌ను ఓటీటీ కట్‌లో జోడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ వెర్షన్‌లో ఈ పాట పెడితే, డిజిటల్ స్క్రీన్‌పై వీక్షకుల తాకిడితో పాత రికార్డులు గల్లంతవడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.