The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarvapindi to Be Served at The Paradise Movie Interval: ‘ది ప్యారడైజ్’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా గురించే పెద్ద చర్చ. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో నానికి జోడీగా గ్లామర్ డాల్ కయాదు లోహర్ నటించగా.. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషించారు. ప్యారడైజ్ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఈరోజు ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ది ప్యారడైజ్ సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు థియేటర్లలో మరింత ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా తెలంగాణలో ఫేమస్ స్నాక్‌ను ఇంటర్వెల్ సమయంలో అందించేందుకు మైత్రీ థియేటర్స్ సిద్ధమైంది. తెలంగాణ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సర్వపిండిని ప్యారడైజ్ మూవీని ప్రదర్శించే కొన్ని థియేటర్లలో ఇంటర్వెల్ స్నాక్‌గా అందించనున్నట్లు మైత్రీ థియేటర్స్ ప్రకటించింది. తెలంగాణ రుచిని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఏర్పాటును చేస్తున్నట్లు తెలిపింది.
Also Read
మైత్రీ విమల్, మైత్రీ శివ గంగా థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో సర్వపిండిని అందించనున్నట్లు మైత్రీ థియేటర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఓ 77 ఏళ్ల బామ్మ సర్వపిండిని తయారుచేయనున్నారు. సినిమా విడుదల సమయంలో ప్రేక్షకులకు కేవలం తెరపై వినోదం మాత్రమే కాకుండా.. స్థానిక సంస్కృతి, ఆహారపు రుచిని కూడా పరిచయం చేయాలనే ప్రయత్నంను మైత్రీ చేస్తోంది. తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన సర్వపిండిని థియేటర్లలో అందించడంపై సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Bringing the Taste of Telangana to Your Favourite Single Screens! ❤️🔥
Mythri Theatres brings Telangana’s much-loved Sarvapindi to Mythri Vimal & Mythri Shiva Ganga, making it a special part of the interval experience for #TheParadise. 🌾❤️ pic.twitter.com/Xa2YhB8GUj
— Mythri Theatres (@MythriTheatre) September 23, 2026
తాజావార్తలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?