The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!

Nani, Venky Atluri

Nani, Venky Atluri, Natural Star Nani Upcoming Films, Nani Bloody Romeo Sujeeth, The Paradise Nani Movie, Sithara Entertainments, Naga Vamsi, Tollywood News 2026.

The Paradise: నేచురల్ స్టార్ నాని సినిమా అంటే కంటెంట్ పక్కాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మాత్రం థియేటర్లలో మిక్సిడ్ టాక్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని లోపాలు కనిపించాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు, కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ థియేట్రికల్ రన్ ముగిసి, డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న వేళ నాని తీసుకుంటున్న బోల్డ్ డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓటీటీ రిలీజ్ కోసం నాని సినిమాను స్వయంగా దగ్గరుండి రీ-ఎడిట్ చేయిస్తున్నారన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా థియేటర్లలో ఏ వెర్షన్ రిలీజ్ అవుతుందో, దాదాపు అదే కాపీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలోకి కూడా వస్తుంది. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం నాని అలా వదిలేయడానికి రెడీ లేరని చెబుతున్నారు. ఇదే టైంలో థియేటర్‌ ఆడియన్స్ నుంచి వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను కూడా నాని చాలా సీరియస్‌గా తీసుకున్నారని చెబుతున్నారు. అందుకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక ఎలాంటి ట్రోలింగ్‌కు ఆస్కారం లేకుండా ఉండేలా కత్తెరకు పనిచెబుతూ, స్క్రీన్‌ప్లేను మరింత టైట్‌గా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రీ-ఎడిటింగ్‌లో కేవలం సీన్లను ట్రిమ్ చేయడమే కాకుండా, థియేట్రికల్ వెర్షన్‌లో లేని సరికొత్త కంటెంట్‌ను కూడా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రన్‌టైమ్ కారణాలతో థియేటర్లలో కట్ చేసిన ఒక పూర్తి సాంగ్‌ను ఓటీటీ వెర్షన్‌లో కలపబోతున్నారని సమాచారం. దాంతో పాటు పాటల్లో మిస్సైన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్‌ను కూడా డిజిటల్ కాపీలో యాడ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సినిమా రిజల్ట్‌ను లైట్ తీసుకోకుండా, ఓటీటీ ఆడియన్స్‌కు ఒక పర్‌ఫెక్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్న నాని పట్టుదల చూసి సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త మార్పులతో రాబోతున్న ‘ది ప్యారడైజ్’ ఓటీటీ కట్ డిజిటల్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.