The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!

The Paradise, Nani

The Paradise, Nani

The Paradise Hero Nani Reacts to Trolls and Love: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమాపై వచ్చిన ప్రతి స్పందనను తాను గమనించానని నాని పేర్కొన్నారు.

‘మీ అందరి రియాక్షన్స్ చూశాను. మీరు చూపించిన ప్రేమను అందుకున్నాను. అదే సమయంలో మీరు చేసిన ఫన్నీ ట్రోల్స్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు సినిమాను తమ సొంత సినిమాలా ఆదరించిన తీరు నా హృదయాన్ని తాకింది. అదే సమయంలో విమర్శకులు, రివ్యూవర్లు సినిమాలోని లోపాలను ఎత్తిచూపిన విషయాల నుంచి కూడా మేము నేర్చుకున్నాం. ది ప్యారడైజ్ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాము. మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రక్తం, చెమట చిందించి ఈ సినిమాను రూపొందించాం. ఇప్పుడు ఈ సినిమా మీదే. మీరు దీన్ని సెలబ్రేట్ చేయాలనుకున్నా, జడ్జ్ చేయాలనుకున్నా అది మీ ఇష్టం’ అంటూ నాని పోస్ట్ చేశారు.

సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులు చూపించిన ఉత్సాహం, తనపై చూపించిన అభిమానానికి నాని కృతజ్ఞతలు తెలిపారు. ‘సినిమాపై మీరు చూపించిన ఎగ్జైట్‌మెంట్, నాపై చూపించిన ఆప్యాయత నా హృదయాన్ని ఉప్పొంగేలా చేసింది. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేమీ చెప్పలేను’ అంటూ నాని రాసుకొచ్చారు. ప్యారడైజ్ మూవీపై వస్తున్న స్పందనల మధ్య నాని చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలను కూడా స్వీకరిస్తున్నానని నాని చెప్పుకొచ్చారు.