The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise Hero Nani Reacts to Trolls and Love: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమాపై వచ్చిన ప్రతి స్పందనను తాను గమనించానని నాని పేర్కొన్నారు.
‘మీ అందరి రియాక్షన్స్ చూశాను. మీరు చూపించిన ప్రేమను అందుకున్నాను. అదే సమయంలో మీరు చేసిన ఫన్నీ ట్రోల్స్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు సినిమాను తమ సొంత సినిమాలా ఆదరించిన తీరు నా హృదయాన్ని తాకింది. అదే సమయంలో విమర్శకులు, రివ్యూవర్లు సినిమాలోని లోపాలను ఎత్తిచూపిన విషయాల నుంచి కూడా మేము నేర్చుకున్నాం. ది ప్యారడైజ్ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాము. మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రక్తం, చెమట చిందించి ఈ సినిమాను రూపొందించాం. ఇప్పుడు ఈ సినిమా మీదే. మీరు దీన్ని సెలబ్రేట్ చేయాలనుకున్నా, జడ్జ్ చేయాలనుకున్నా అది మీ ఇష్టం’ అంటూ నాని పోస్ట్ చేశారు.
Also Read
- D56 : నాగవంశీ - ధనుష్ - తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
- The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
- Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులు చూపించిన ఉత్సాహం, తనపై చూపించిన అభిమానానికి నాని కృతజ్ఞతలు తెలిపారు. ‘సినిమాపై మీరు చూపించిన ఎగ్జైట్మెంట్, నాపై చూపించిన ఆప్యాయత నా హృదయాన్ని ఉప్పొంగేలా చేసింది. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేమీ చెప్పలేను’ అంటూ నాని రాసుకొచ్చారు. ప్యారడైజ్ మూవీపై వస్తున్న స్పందనల మధ్య నాని చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలను కూడా స్వీకరిస్తున్నానని నాని చెప్పుకొచ్చారు.
I have seen all your reactions and responses. I’ve received all your love and equally enjoyed your hilarious trolls. I’m heartwarmed by the way audience have owned the film, and also learnt from the flaws that critics and reviewers have pointed out.
Thank you for everything is…
— Nani (@NameisNani) September 25, 2026
తాజావార్తలు
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!