The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..

Cinema

Cinema

The Paradise : న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రా అండ్ రస్టిక్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఏషనాగుల’ సాంగ్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుండగా, సినిమా కథా నేపథ్యం, నాని ఊర మాస్ లుక్‌పై అనేక అనుమానాలు, చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో సినిమాలో ‘బిర్యానీ’ అనే కీలక పాత్ర పోషించిన నటుడు సంపూర్ణేష్ బాబు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాని ఫస్ట్ లుక్ నుంచి అందరినీ అమితంగా ఆకర్షిస్తున్న అంశం ఆయన జడలు. ఆ జడల వెనుక ఉన్న కథ ఏంటన్న ప్రశ్నకు సంపూ సమాధానమిస్తూ.. “నాని గారి పాత్రకు ఆ జడలు ఎందుకున్నాయి అనే దాని వెనుక సినిమాలో చాలా పెద్ద ట్విస్టులు ఉన్నాయి.

అసలు ఆ పాత్ర నేపథ్యం ఏంటి? ఎందుకు అంత పెద్ద తిరుగుబాటు వచ్చింది? తల్లి-కొడుకుల మధ్య అంత బలమైన ఎమోషన్ ఎందుకు రగిలింది? అనే విషయాలు తెరపై చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది” అని పేర్కొన్నారు. సినిమా నేపథ్యం పీరియడ్ డ్రామానా లేక తెలంగాణ పల్లెటూరి కథా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు. సినిమా ఔట్‌పుట్‌పై పూర్తి ధీమా వ్యక్తం చేసిన సంపూ.. ప్రేక్షకులు ప్యారడైజ్ బిర్యానీ తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఫీలవుతారో, ఈ సినిమా చూశాక అంతకు డబుల్ హ్యాపీగా థియేటర్ల నుంచి బయటకు వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రతి పాత్ర నుంచి తాను అనుకున్న ఎమోషన్, యాక్టింగ్ వచ్చేంత వరకు నటీనటులతో ప్రాణం పెట్టి పని చేయించారని చెప్పారు. కేవలం పాటలు, మాస్ ఎలివేషన్లు మాత్రమే కాకుండా, బలమైన కథ, గుండెల్ని పిండేసే ఎమోషన్లతో ఈ చిత్రం రాబోతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా నాని క్యారెక్టరైజేషన్, ఆయన లుక్ వెనుక ఉన్న అసలు మిస్టరీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.