నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్ఫాడిస్తున్నాడు. వైలెన్స్ పీక్స్ లో ఉండటంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు. ఇందులో ‘ది ప్యారడైజ్’ ఇకటి.
Also Read : WAVES 2025 : OTT ల పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన అమీర్ ఖాన్..
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అంతా చూసే ఉంటారు. నాని మరోసారి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టనున్నాడు. ‘ఇది కడుపు మండిన కాకులు కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ’ అంటూ ఈ వీడియోలో వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
Also Read: Nagarjuna : పాన్ ఇండియా చిత్రాల పై నాగార్జున కామెంట్స్ వైరల్..
ఈ మధ్య కాలంలో బడా చిత్రలతో భాగం కావడానికి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇక సినిమాకు భారీ బడ్జెట్ అవసరం పడుతుండటంతో మేకర్స్ కూడా వారితో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సరిగమ నాని ‘ది ప్యారడైజ్’ ఈ సినిమాను కో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక మ్యూజిక్ రైట్స్ మాత్రమే కాకుండా నిర్మాణ పరంగా కూడా భాగం అయింది.
