Site icon NTV Telugu

Mollywood : మలయాళం హిట్ తో తమిళ్ లో దూసుకెళ్తున్న బ్యూటీ

Kalyhani Priyadarshan

Kalyhani Priyadarshan

హలోతో కెరీర్ స్టార్ట్ చేసిన కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్‌ను ఆకాశానికి లేపిన ఫిల్మ్ లోక. 30 కోట్లతో తెరకెక్కిన ఈ మలయాళ సినిమా 300 కోట్లను రాబట్టుకుని మాలీవుడ్ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలవగా సౌత్‌లో అత్యధికంగా వసూళ్లు చేసిన ఫీమేల్ ఓరియెంట్ చిత్రాల్లో ఫస్ట్ ప్లేసును ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది ఈ ఫిల్మ్. లోక అక్టోబర్ 31 నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Vash Level 2 : ఏ గుజరాతీ ఫిల్మ్‌కు దక్కని ఆఫర్.. రికార్డ్ క్రియేట్ చేసిన వశ్ లెవల్2..

లోకతో కళ్యాణి ప్రియదర్శన్ క్రేజే కాదు.. కెరీర్ కూడా స్పీడ్ అందుకుంది. అయితే మలయాళం కన్నా కోలీవుడ్‌లో బిజీగా మారింది ఈ కేరళ కుట్టీ. లోక రిలీజ్‌కు ముందే జయం రవి జీనీ ప్రాజెక్టు చేతులో ఉండగా కార్తీ మార్షల్ సినిమాకు కూడా కమిటయ్యింది. తమిళ డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 1960లో రామేశ్వరం బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఉండబోతుందని టాక్. ఈ మధ్యే షూటింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్. పాన్ ఇండియాలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.  తాజాగా మరో తమిళ సినిమాకు కళ్యాణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. శివకార్తీకేయన్‌తో మరోసారి జోడీ కట్టబోతోందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పరాశక్తి తర్వాత శివకార్తీకేయన్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో  సినిమా చేస్తున్నాడు. ఇందులోను కళ్యాణి ప్రియదర్శన్  ఫిక్సైనట్లు బజ్. శివ అండ్ కళ్యాణి గతంలో హీరో అనే ఫిల్మ్‌లో కలిసి నటించారు. లోక హిట్ కు ముందు లేడి ఓరియెంటెడ్ ఫిల్మ్స్, మిడ్ రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చిన కళ్యాణి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు చేస్తోంది. ఒక ఒక హిట్ ఆమె కెరీర్ ను బూస్ట్ చేసింది.

Exit mobile version