Site icon NTV Telugu

Nivetha Pethuraj : కాబోయే భర్తను పరిచయం చేసిన ‘నివేద పేతురేజ్’.. ‘లక్కీ బాయ్’

Nvietha Pethuraj

Nvietha Pethuraj

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై భామ అయిన నివేదా పేతురాజ్‌ ”మెంటల్‌ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.. రామ్ తో రెడ్, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం, చిత్రలహరి, ధమ్కీ వంటి సినిమలతో హిట్స్ అందుకుంది. కానీ ఎందుకనో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయింది నేవేత.

Also Read : Mollywood : మోహన్ లాల్ సినిమాతో పోటిలో దూసుకెళ్తున్న లేడీ ఓరియంటె ఫిల్మ్

ఇటీవల తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె తన కాబోయే భర్త మరియు చిరకాల ప్రియుడు రాజ్‌హిత్‌ ఇబ్రాన్ ను పరిచయం చేసింది. చాలా కాలంగా నివేదా – రాజ్‌హిత్‌ తో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్  చేసింది. త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. రాజ్‌హిత్‌  దుబాయ్ లో హాస్పిటాలిటీ రంగంలో ఉన్నతమైన వ్యాపారవేత్త అని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో నివేద – రాజ్‌హిత్‌ ల వివాహం ఉండొచ్చుని తెలుస్తోంది. అయితే తమకు ఈ పాటికే ఎంగేజ్మెంట్ అయినట్టు నివేద ఇండైరెక్ట గా తెలిపింది. ఇన్‌స్టాలో తనకు కాబోయే భాగస్వామి రాజ్‌హిత్‌ ఇబ్రాన్‌ను పరిచయం చేస్తూ ‘ఇప్పటినుంచి జీవితమంతా ప్రేమమయమే..’ అనే క్యాప్షన్‌తో  రాజ్‌హిత్‌ దిగిన ఫొటోలను షేర్ చేసింది. అలాగే నివేద – రాజ్‌హిత్‌ ఈ వివాహం కేవలం కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో జరిగే ఒక చిన్న వేడుకలాగా చేసుకోబోతుందట. ఈ జంట త్వరలోనే పెళ్లి డేట్ ను అధికారకంగా ప్రకటించనున్నారు.

Exit mobile version