NTV Telugu Site icon

Re-release: ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్..ఎప్పుడంటే..?

Untitled Design (4)

Untitled Design (4)

టాలీవుడ్ లో సూపర్ హిట్  సినిమాల రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది.  కాని ఇటీవల వాటి ఫలితాలు ఆశించినంతగా లేవు. అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలి అని చుసిన కొందరికి  ఫ్యాన్స్  షాక్ ఇచ్చారు. కొందరు స్టార్ హీరోల ఫ్లాప్ చిత్రాలను విడుదల చేయగా ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా తిప్పికొట్టారు. ఉదాహరకు భారతీయుడు -2 విడుదల సందర్భంగా భారతీయుడు రీరిలీజ్ చేయగా షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కాగా టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తన కెరీర్ ను మలుపు తిప్పిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా “శివ”. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ అప్పట్లో ఓక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇన్నాళ్లకు శివ రీరిలీజ్ కానుందని సమాచారం. ఆగస్ట్ 29 కింగ్ నాగ్ బర్త్ డే కానుకగా అయితే రీ రిలీజ్ చేసేందుకు అక్కినేని అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తుంది. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు9న మురారి, ఒక్కడు చిత్రాలను రిలీజ్ చేయబోతున్నారు నిర్వాహకులు. ఘట్టమనేని వారి వివాహానికి రావాలంటూ మురారి చిత్ర రీరిలీజ్ సరికొత్త ప్రమోషన్స్ కు తెరలేపారు ఘట్టమనేని ఫ్యాన్స్. తమ కకెరీర్ లను  మలుపు తిప్పిన  శివ, మురారి రీ రిలీజ్ లు ఏ మేరకు కలెక్షన్లు రాబడతాయో చూడాలి