Re-release: ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్..ఎప్పుడంటే..?
- టాలీవుడ్ లో రీరిలీజ్ ల పర్వం
- ఇద్దరు స్టార్ హీరోల సినిమాల విడుదలకు ఏర్పాట్లు
- అప్పట్లో సూపర్ హిట్ మరి ఇప్పుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. కాని ఇటీవల వాటి ఫలితాలు ఆశించినంతగా లేవు. అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలి అని చుసిన కొందరికి ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. కొందరు స్టార్ హీరోల ఫ్లాప్ చిత్రాలను విడుదల చేయగా ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా తిప్పికొట్టారు. ఉదాహరకు భారతీయుడు -2 విడుదల సందర్భంగా భారతీయుడు రీరిలీజ్ చేయగా షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
కాగా టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తన కెరీర్ ను మలుపు తిప్పిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా “శివ”. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ అప్పట్లో ఓక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇన్నాళ్లకు శివ రీరిలీజ్ కానుందని సమాచారం. ఆగస్ట్ 29 కింగ్ నాగ్ బర్త్ డే కానుకగా అయితే రీ రిలీజ్ చేసేందుకు అక్కినేని అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తుంది. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు9న మురారి, ఒక్కడు చిత్రాలను రిలీజ్ చేయబోతున్నారు నిర్వాహకులు. ఘట్టమనేని వారి వివాహానికి రావాలంటూ మురారి చిత్ర రీరిలీజ్ సరికొత్త ప్రమోషన్స్ కు తెరలేపారు ఘట్టమనేని ఫ్యాన్స్. తమ కకెరీర్ లను మలుపు తిప్పిన శివ, మురారి రీ రిలీజ్ లు ఏ మేరకు కలెక్షన్లు రాబడతాయో చూడాలి
Also Read
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!