హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ వేడుక ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా ఆరంభమైంది. 97వ ఆస్కార్స్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్స్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక రెండేళ్ల క్రితం మన ఇండియన్ మూవీకి ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించింది. ఈ సారి ఊహించని సినిమాలకు, ఆర్టిస్టు లకు అవార్డులు వరిస్తున్నాయి. ఈ సారి కంటెంట్‌కి పెద్ద పీఠ వేస్తున్నట్టు తెలుస్తుంది.
Also Read: Sleeping : అతిగా నిద్రపోతున్నారా..?
ఇందులో భాగంగా బెస్ట్ ఫిల్మ్ క్యాటగిరి లో అనేక చిత్రాలు పోటీపడగా ‘అనోరా’ సినిమాను ఆస్కార్ 2025 ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ముద్దాడింది. కాగా 97వ అకాడమీ అవార్డ్స్‌లో ‘అనోరా’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకోవడం మాత్రమే కాదు, ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ ఉత్తమ దర్శకత్వ విభాగం ఆస్కర్ గెలుచుకోవడంతో పాటుగా, ఈ చిత్రం మొత్తం ఐదు విభాగాల్లో గెలుపొందింది. ఈ ఏడాది 5 ఆస్కార్లు గెలుచుకున్న సినిమాగా ‘అనోరా’ చరిత్ర సృష్టించింది.
ఇక బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న ఆనోరా దర్శకుడు సీన్ బేకర్ తన తొలి సినిమాను 2015 లో టాన్జరిన్‌తో ప్రారంభించాడు. ఈ మూవీని తన ఐఫోన్‌లో చిత్రీకరించాడు. అందుకున్నాడు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఆస్కార్ ను గెలుచుకున్నాడు సీన్ బేకర్. పెద్ద బడ్జెట్‌లు, చిత్రాలను చిత్రీకరించడానికి ఫ్యాన్సీ కెమెరాలు అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే ప్రశంసలు వాటంతట అవే వస్తాయని మరోసారి నిరూపించాడు ఆస్కార్ విన్నర్ సీన్ బేకర్.